చివరి విడత ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు
మహబూబ్‌నగర్,జనవరి28(జనంసాక్షి): ఈనెల 30న నాలుగు జిల్లాల పరిధిలో 24 మండలాల్లోని 483 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రాచరం చివరి రోజు కావడంతో సోమవారం అబ్యర్థులు జోరుగా ఊరేగింపులు,ర్యాలీలు నిర్వహించారు. డప్పు చప్పుల్లతో మార్మోగించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గండీడ్ మండలంలో గోవిందపల్లి 5, 6వ వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం తిప్పర్‌పల్లిలో ఒక వార్డుకు, ఆదే మండలంలోని సూకూర్ పంచాయతీలో మరో వార్డుకు ఎన్నికలు జరగడం లేదు. చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారపర్వం సమాప్తం అయ్యింది. నెల రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. మూడుకుగాను రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈనెల 21, 25న రెండు విడతల్లో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,684 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో 7 మినహా 1,677 గ్రామపంచాయతీలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అందులో మొదటి, రెండు విడతల్లో 1,194 పంచాయతీలకు జరిగాయి. చివరి విడతలో
ఈనెల 23న నామినేషన్ల ఉపసంహరణ అయిపోయింది. నాలుగు రోజులుగా అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటేయాలని కోరుతున్నారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి ఉమ్మడి జిల్లా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికే చివరి విడత ఎన్నికలు జరిగే మండలాలకు సామగ్రిని పంపించారు. బ్యాలెట్‌పత్రాలు, డబ్బాలను తరలించారు. వాటితోపాటు ఎన్నికల్లో విధుల నిర్వర్తించే పీవోలు, ఏపీవోలు, జోనల్ అధికారులు, సూక్ష్మపరిశీలకులు, రూట్ అధికారులు, వీడియోగ్రాఫర్లు, వెబ్‌కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. వారికి
ఇప్పటికే ఉత్తర్వులు అందించారు. ఈనెల 29న వారంతా ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కంటే అదనంగా 10 శాతం సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నారు.