చురుకుగా విత్తన పంపిణీ

విజయనగరం,జూన్‌9(జనం సాక్షి ): తొలకరి ప్రారంబం కావడంతో ప్రస్తుతం శుద్ధి చేస్తున్న విత్తనాన్ని ఎప్పటి కప్పుడు విజయనగరం, విశాఖపట్టణం జిల్లల్లా మండల కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు వివరించారు. వర్షానికి తడిచిపోకుండా పరదాలను కప్పుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జల్లులు కురవక ముందే విత్తనాలను రైతులకు అందించేందుకు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సమాయత్తమైంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, పచ్చిరొట్ట, వేరుసెనగ విత్తనాలు సిద్ధం చేశారు. ఇందులో వరి విత్తనాలు 10 వేల క్వింటాళ్లు మండల కేంద్రాలకు తరలించారు. పచ్చిరొట్ట, వేరుసెనగ విత్తనాలు మండలాల్లో పంపిణీ జరుగుతోంది. విజయనగరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో గోదాములను అద్దెకు తీసుకుని ఏపీ సీడ్స్‌ధాన్యాన్ని శుద్ధి చేసి ప్యాకింగ్‌ చేస్తోంది. నిల్వ చేసేందుకు సరైన గోదాము సౌకర్యం లేకపోవడంతో చినుకులు పడితే కారిపోయే పరిస్థితి ఉన్నందున విత్తనాలు తడిచి తేమ శాతం కోల్పొయి మొలకశాతాన్ని నష్టపోవల్సి ఉంటుంది. దీంతో త్వరగా సరఫరా చేపట్టారు.