చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడపత్రికను ఆవిష్కరించిన – డీఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో నవంబరు5జనం సాక్షి:
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ గోడపత్రిక, కరపత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు శనివారం డీఈఓ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ……
ఈ సంవత్సరం నవంబర్ 18 నుంచి జన విజ్ఞాన వేదిక – చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ ప్రారంభం అవుతుందన్నారు.
4 దశలలో జరిగే ఈ టాలెంట్‌ టెస్ట్‌కి 8,9,10 తరగతులు చదివే విద్యార్థులు అర్హులన్నారు.
విద్యార్థులలో శాస్త్రీయ దక్పథం, పరిసరాల అవగాహన పెంపొందించే దిశలో నిర్వహించే ఈ ప్రతిభా పరీక్ష ను అందరూ విద్యార్థుల చేత పరీక్ష రాయించే బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తీసుకోవాలని సూచించారు. చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ గురించి సమాచారం కోసం జిల్లా అధ్యక్షులు ఎల్ పర్వతాలు ( 9440822657) ని సంప్రదించవచ్చు అన్నారు.
జిల్లా అధ్యక్షులు పర్వతాలు మాట్లాడుతూ….
చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నవంబర్ 18న పాఠశాల స్థాయి, నవంబర్ 22న మండల స్థాయి, నవంబర్ 27న జిల్లాస్థాయి, డిసెంబర్ 9, 10, 11వ తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరగనుందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఐదు రూపాయలు, ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు 10 రూపాయలు రుసుం చెల్లించి టాలెంట్ టెస్ట్ లో విద్యార్థులు పాల్గొనవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఏసీ రాజశేఖర్ రావు, సెక్టోరిల్ అధికారి బరపటి వెంకటయ్య, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఎల్ పర్వతాలు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కమిటీ సభ్యులు నెహ్రూ ప్రసాద్, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర శెట్టి పాల్గొన్నారు.