చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ : కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 : నగరంలోని గోల్కొండ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మరణించారు. వేగంగా వస్తున్న రెడీమిక్స్‌ లారీ పోలీసు చెక్‌పోస్టుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ రాహుల్‌ యాదవ్‌ మృతి చెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు వీరేందర్‌, పవన్‌, సైదులుకు గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుళ్లను ఆపోలో, కేర్‌ ఆసుపత్రుల్లో చికిత్స జరిపిస్తున్నారు. పోలీసులు లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.