చెట్టుకు లారీ ఢీకొని డ్రైవర్‌ మృతి

ధర్మారం: వరంగల్‌-రాయపట్నం రాష్ట్ర రహదారిపై మల్లాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందారు. మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న బొగ్గులోడుతో ఉన్న లారీ చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ దుగ్గ నారాయణ (45) అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన వాడని, నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగి ఉండచ్చొని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.