చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి

చేగుంట: మండలంలోని భీమరావుపల్లిలో శనివారం చెట్టు పై నుంచి కింద పడి శంకర్‌(45) అనే వ్యక్తి మృతి చెందాడు. చింతపండు తెంపుతూ చెట్టుపై నుంచి ప్రమాద వశాత్తూ కాలుజారి కింద పడటంతో శంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. చేగుంట ఎస్సై వినాయకరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.