చెట్లు నాటే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి…
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్..
జనగామ కలెక్టరేట్ జూలై 6(జనం సాక్షి):జిల్లాలో వర్షాలు పడుతుండడంతో వాతావరణం అనుకూలిస్తున్నందున హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆదేశించారు.బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులతో, మండలాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారం కార్యక్రమాన్ని సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు పడు తున్నందున వాతావరణ అనుకూలంగా ఉందని ఎనిమిదవ విడత హరితహారం కార్యక్రమాన్ని ఉదృతంగా చేపట్టి పిట్టింగులు తీయించాలని, మొక్కలను విస్తృతంగా నాటింపచేయాలని పనులను ముమ్మరంగా చేపట్టాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్కకు అదే రోజు సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రతిరోజు నాటిన మొక్కల పై నివేదిక అందించాలని ఆన్లైన్ చేస్తూ జియో ట్యాగింగ్ చేస్తూ పేమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ మొక్కలను కూడా అందజేస్తూ నాటింప చేయాలన్నారుఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డి ఆర్ డి ఏ పిడి రామ్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.