చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు

922jiwt9నల్గొండ,  సూర్యాపేట పట్టణంలోని సుందరయ్యనగర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లారు. ఆడశిశువును గుర్తించిన స్థానికులు శిశువును ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. ఆడశిశువు ఎవరిదనే విషయంపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.