చెడు వ్యసనాలను అలవాటు చేసుకోవద్దు – డిఎస్పీ కిషన్*
*అనుమానిత వ్యక్తులు కనపడితే సమాచారం అందించాలి – సిఐ కిరణ్*
*పలిమెల ఆగస్ట్ 08 (జనంసాక్షి)*
జయశంకర్ భూపాలపెల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలో కాటారం డిఎస్పీ బోనాల కిషన్, మహదేవపూర్ సిఐ కిరణ్ మరియు ఎస్ఐ అరుణ్ ఆధ్వర్యంలో పోలీసుల కార్టన్ సెర్చ్ నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రతి వాడలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం డిఎస్పీ బోనాల కిషన్ మరియు సిఐ కిరణ్ గ్రామస్తులతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పడుతున్న అధిక వర్షాలు, వరదల కారణంగా జ్వరం, మలేరియ, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోనీ తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలను చక్కగా చదివించాలని పిల్లల తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు, చెడు వ్యసనాలకు యువత దూరంగా వుండాలని, చదువులతో పాటు క్రీడల్లో ముందుండాలని యువతకు పిలుపు నిచ్చారు. క్రొత్త అనుమానిత వ్యక్తులు ఎవరయినా వస్తే సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించడం జరిగింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు అయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ బోనాల కిషన్, మహాదేవ్ పూర్ సిఐ కిరణ్, పలిమెల ఎస్ఐ అరుణ్, పలిమెల పోలీస్ స్టేషన్ సిబ్బంది తో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.