చెత్త సమస్యలతో ప్రజల ఆందోళన
మెదక్,మే14(జనం సాక్షి): ప్రతి రోజూ గ్రామాల్లో పోగయ్యే చెత్తను ఎక్కడపడితే అక్కడ పారబోసి తగులబెట్టడంతో కాలుష్య సమస్య ప్రజలను వేధిస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రతిరోజూ సుమారు 200 టన్నుల వరకు చెత్త పోగవుతోంది. జిల్లాలో రామాయంపేట, చేగుంట, నార్సింగి, తూప్రాన్, మనోహారబాద్‌లలో పొగయ్యే చెత్తను జాతీయ రహదారిపై, మండలాల్లోని గ్రామాల్లో చెత్తను వూరికి చివరలో పారబోస్తున్నారు. దీంతో పరసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించి స్థానికులు ఆనారోగ్యబారిన పడుతున్నారు. తూప్రాన్‌లో పెద్దచెరువు వద్ద చెత్తాచెదారానికి నిప్పుపెట్టుతుండటం వల్ల మూడుగ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో కేవలం రెండు గ్రామాల్లోనే డంపింగ్ యార్డులు ఉన్నాయి. డంపింగ్ యార్డు లేక చెత్తను కాల్చడం వల్ల కాలుష్యం వెదజల్లుతోంది. గ్రామాల్లో డంపింగ్ యార్డులను నిర్మించాలని భావించారు. ఈ మేరకు ఉపాధి హవిూ పథకం కింద నిర్మిస్తున్నారు.
ఆయా గ్రామాల్లో పనులు ప్రారంభమయినట్లు జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.