చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్
మందకొడిగా సాగిన ఓటింగ్
గ్రామాల్లో బారులు తీరిన ప్రజలు
నగరంలో అంతంతమాత్రంగానే ఓటింగ్
ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు, అధికారులు
ఓటు హక్కు వినియోగించుకున్న వికాస్ రాజు
ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటేసిన వృద్ధుడు
హైదరాబాద్,నవంబర్30 (జనంసాక్షి): రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినా పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు 20.64 పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా అదిలాబాద్‌లో 30. 65 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్‌లో 12.39 శాతం నమోదైంది. మధ్యాహ్నం తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఈసీ భావిస్తోంది. ఉదయం నుంచే ప్రజలు క్యూ లైన్లో ఉంటూ ఓటు వేశారు. సిఇసి వికాస్ రాజ్ హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ లో ఓ పోలింగ్ కేంద్రంలో తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలని అన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు, సినీ ప్రముఖులు పలువురు తమ ఓటును వినియోగించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిం చుకునేందుకు భారీ మొత్తంలో క్యూలైన్లలో బారులు తీరారు. అయితే, కొన్నిచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరులో చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. దాంతో ఆయా జిల్లాల ఘటనలపై సీఈఓ వికాస్ రాజ్ ఆరా తీశారు. వెంటనే ఘర్షణలను అదుపు చేయాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులకు సీఈఓ ఆదేశించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘనటనలు జరగకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడక్కడ జరుగుతున్న గొడవలపై డీజీపీతో మాట్లాడిన సీఈఓ వికాస్ రాజ్.. పోలింగ్ సాయంత్రం వరకు జరగాల్సి ఉన్నందున సమస్యలు లేకుండా చూడాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు మొదలైంది.ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకూ 7.78 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ సందడి కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రావ దగ్గర క్యూ కట్టారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులూ, ఇతర అధికారులు కూడా ఓట్లు వేయడానికి తరలివచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓ లెక్క.. హైదరాబాద్ ఒక్కటి మరోలెక్క అన్నట్టు పరిస్థితి మారింది. ఈ ఏడాది కూడా హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తక్కువే నమోదయ్యేట్టుంది. తెలంగాణ వ్యాప్తంగా అతి తక్కువ ఓటింగ్ హైదరాబాద్ లోనే కావడంతో ఈ చర్చ జరుగుతోంది. ఎన్నికల రోజును ప్రభుత్వం పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తోంది. ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తున్నాయి. అయినా ఓటేసేందుకు ఓటర్లు పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు. బారెడు పొª`దదెక్కినా ఏదో వీకెండ్ రోజు రిలాక్సవుతున్నట్టు ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఇల్లు కదలనివారు కొందరైతే…హాలిడే
వచ్చిందంటూ సొంత పనులు చూసుకుంటున్నవారు మరికొందరు. సెలవు ప్రకటించి మరీ ఓటేయమంటే భాగ్యనగర వాసుల తీరు ఇలా ఉంది. ఇకపోతే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20.64 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం పోలింగ్ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 12.39 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం దాటినప్పటికీ ఇంకా ఆశించినంతగా పోలింగ్ శాతం నమోదు కాలేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. ఓటింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సెలవులు కూడా ఇచ్చింది. కానీ, కొంత మంది ఓటు వేయకుండా ఈ సెలవు రోజును ఇతర పనులకు వాడుకుంటున్నారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా, వాళ్ల బాధ్యతను గుర్తు చేసేలా కొంత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తీరు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తోంది. లివర్ సిరోసిస్ తో బాధ పడుతున్న ఓ పెద్దాయన ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఓటు వేయడానికి వచ్చారు. గచ్చిబౌలి ప్రాంతంలోని ఉఖఖీం క్వార్టర్స్ పోలింగ్ బూత్ లో ఈ ఘటన జరిగింది. శేషయ్య అనే 75 ఏళ్ల వయసున్న వ్యక్తి గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ స్పిర్రగ్స్‌లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన లివర్ సిరోసిస్ తో బాధ పడుతున్నారు. ఓటు వేయడం బాధ్యతగా భావించి.. ఓ పౌరుడిగా తన కర్తవ్యం అని ఆయన చాటుకున్నారు. ఏకంగా ఆక్సీజన్ సిలిండర్, మాస్క్ తో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. 1966 నుంచి తాను మిస్ అవ్వకుండా ఓటు వేస్తున్నానని చెప్పారు. దీంతో ఆయన ఎంత మందికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.