చెన్నైకి సూపర్ దెబ్బ: గాయంతో ఇర్ఫాన్ పఠాన్ దూరం

fxdwtlz3చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క బంతి కూడా ఆడకుండా ఆ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. బరోడా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గాయం కారణంగా రేపు (గురువారం) ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచుకు దూరం కానున్నాడు. ఇర్ఫాన్ పఠాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. గత కొద్ది రోజులుగా అతను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. అయితే, అతను గాయాల పాలయ్యాడు. దీంతో డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచులో అతను పాల్గొనడం లేదని చీఫ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిర్ధారించాడు. ఇర్ఫాన్ పఠాన్ ఫిట్‌గా లేడని, మరో పేసర్ ఆండ్ర్యూ టై కూడా గాయంతో బాధపడుతున్నాడని, వారిని పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదని, వారి పరిస్థితిని రోజువారీ ప్రాతిపదికపై అంచనా వేస్తామని ఫ్లెమింగ్ మీడియా సమావేశంలో అన్నాడు. చెన్నైకి సూపర్ దెబ్బ: గాయంతో ఇర్ఫాన్ పఠాన్ దూరం పఠాన్ మణికట్టు, మోకాలు తదితర గాయాలతో బాధపడుతున్నాడు. ఆశిష్ నెహ్రా గురించి మాత్రం ఫ్లెమింగ్ మంచి విషయాలు చెప్పాడు. పాత ఆటగాళ్లలో కూడా చేవ ఉందని, నెహ్రాలో ఇంకా పటుత్వం ఉందని, చాలా మంది యువతపై చూస్తారని, కానీ తాను అనుభవాన్ని ఇష్టపడుతానని ఆయన అన్నాడు. నెహ్రా, హస్సీ తమకు అత్యంత ముఖ్యమైనవాళ్లని అన్నాడు. వారి తెలివితేటలు చాలా ఉపయోగపడుతాయని అన్నాడు. ఎంఎస్ ధోనీ, రైనా తమకు కీలకమని, వారి శ్రమ, తీరులను తాను ఇష్టపడుతానని అన్నాడు. సీమర్లను రొటేషన్ పద్ధతిలో వాడుతామని ఫ్లెమింగ్ చెప్పాడు.