చెరువుల పునరుద్ధరణలో పాల్గొంటున్న నేతలు

నల్గొండ,ఏప్రిల్‌1 : జిల్లాలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమాలు జోరందుకున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పనులు చేపట్టడంతో అధికార, విపక్షం అన్న తేడా లేకుండా అందరూ పాల్గొంటున్నారు. చెరువుల పునరుద్దరణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారు. చెరువులను పునరుద్ధరించే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని సీఎల్పీ నేత  జానారెడ్డి కూడా పిలుపునిచ్చారు. చేశారు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భజలాలతో పాటు నిల్వ సామర్థ్యం పెరుగుతాయన్నారు. దీనిని ప్రతి గ్రామంలో ప్రజలు ఉపయోగించుకోవాలని విపక్షనేత సూచించారు. మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువు మరమ్మతు పనులను పలుచోట్ల ఆయన ప్రారంభించారు. సాగర్‌ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆయకట్టేతర ప్రాంతాల్లో చెరువులను పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేశారు.  మిషన్‌ కాకతీయలో భాగంగా జిల్లాలో ప్రస్తుతం తొమ్మిది వందలకుపైగా చెరువులకు మరమ్మతులు చేయనున్నట్లు…వర్షాకాలంలో చెరువులన్నీ జలకళలతో సంతరించుకోనున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు చెరువులను పూర్తిగా విస్మరించారన్నారు. క్రమంగా చెరువులు అంతరించిపోయే పరిస్థితికి వచ్చాయన్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించిందన్నారు.  గత పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేశారు..నాయకులకు ఉపాధిగా మారుస్తు నామినేషన్‌పై పనులు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు.