చెరువుల సూడికతీతతో భూగర్భ జలాలకు బలం
మెదక్,మార్చి30(జనంసాక్షి): మిషన్ కాకతీయతో జిల్లాలో భూగర్భజలాలు పెరుగుతాయని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రాజమణి అన్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పథకంలో భాగంగా చెరువుల నుంచి పూడిక తీసిన మట్టిని రైతులు సద్వినియోగం చేసుకొంటే నేలలు సారవంతం అవుతాయని చెప్పారు. చెరువులు బాగుంటేనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.రాష్ట్రంలోని అన్ని చెరువులను పునరుద్ధరించనున్నట్లు ఆమె చెప్పారు. తెలంగాన ప్రాంతాలను వెనుకబడేసిన ఘనత గత ప్రభుత్వాలదని అన్నారు. చెరువుల పూడికతీతతో ఈ ప్రాంతం అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. జిల్లాలో అనేక చెరువులు పూడుకుని పోయి భూగర్భ జలాలు అడుగంటాయని, ఇప్పుడు చెరువుల పునరుద్ధరణతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. పింఛన్లు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల ప్లలె ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పరిశ్రమలతో పాటు చెరువుల అభివృద్ధి కావాల్సి ఉందని అన్నారు. రైతులు అన్ని విధాల కష్టపడ్డా ధర లేకపోవడం వల్ల మద్దతు లభించడం లేదని తెలిపారు. వ్యవసాయ ఖర్చుఉల తగ్గించుకోవాల్సి ఉందన్నారు.