చేతులు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవు
– బల్దియా మేయర్ గుండు సుధారాణి
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి)
చేతులు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవని బల్దియా మేయర్ గుండు సుధారాణి అభిప్రాయపడ్డారు.
శనివారం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మేయర్ పాల్గొని మెప్మా సిబ్బందికి తగు సూచనలు చేశారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రత తో పాటు కుటుంబ శుభ్రత అత్యంత అవసరం అని, చేతులు శుభ్రపరచుకోవడం లో ప్రదానం గా 6 దశలు ఉంటాయని,వాటి పై సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని.వివిధ సమస్యల పరిష్కరార్థమై ప్రధాన కార్యాలయానికి చేరుకునే ప్రజలు చేతులు శుభ్రపరుచుకోవడం వల్ల రోగాల వ్యాప్తి నిరోధించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమం లో టౌన్ ప్రాజెక్ట్ అధికారి విజయ లక్ష్మి,డి.ఎం.సి.లు రజిత రాణి,రేణుక, సి.ఓ.లు ప్రవీణ్,రజిత తదితరులు పాల్గొన్నారు.
Attachments area