చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, శరీరంలో ఉండే వ్యాధినిరోధక శక్తిపై భారం తగ్గుతుంది;
మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ టౌన్ అక్టోబర్ 15 ( జనంసాక్షి )
కోదాడ పురపాలక సంఘం కార్యాలయం లో గ్లోబల్ హాండ్ వాషింగ్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ను జరుపుకుంటం అన్నారు. వ్యాధుల నివారణకు సబ్బుతో చేతులు కడుక్కోవడం గురించి అవగాహన పెంచడం ఈ డే యొక్క ముఖ్య లక్ష్యం అని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది చిన్న పిల్లలు డయేరియా మరియు నిమోనియా వంటి వ్యాధులతో చనిపోతున్నారు. దీనిని అరికట్టడానికే సబ్బుతో చేతులు కడగడo అనే డే ని ప్రారంభించారని, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.చేతులు శుభ్రంగా లేకపోతే, దానికి ఉండే క్రిములు, బ్యాక్టీరియా,వైరస్‌లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్తాయి అని దీని కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చేతులు శుభ్రం చేసుకోవడంలో ప్రాముఖ్యతను చెప్పడానికే గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటు మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్ తిపిరిశెట్టి సుశీల రాజు,మాజీ కౌన్సిలర్ వనపర్తి సోమమ్మ, శానిటరీ ఇన్స్పెక్టర్ పెరిక యాదగిరి, మునిసిపల్ అధికారులు,మెప్మా సిబ్బంది మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area