చేనేత కార్మికుడి ఆత్మహత్య

నల్లగొండ .ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రాజంపేట మండలం సింగారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రాజప్ప(56) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా పని లభించకపోవడంతో.. కరీంనగర్ జిల్లాకు వలస వెళ్లాడు. అక్కడ కూడా చేతినిండా పని దొరక్కపోవడంతో.. తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాజప్ప ఈ రోజు తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.