చేనేత కార్మికుని ఆత్మహత్య
చౌటుప్పల్ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో అర్థిక ఇబ్బందులతో ఓ చేనేత కార్మికుడు అత్మహత్య చేసుకున్నాడు. కూడి నర్సింహ (50) అనే కార్మికుడు నిన్న రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా… అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.