చేనేత రుణమాఫీకి పూర్తిస్థాయిలో ప్రయత్నించడం లేదు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు సంబంధించిన 317కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామన్న హామీ ఇంతవరకూ పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు యత్నించడం లేదని తెదేపా విమర్శించింది. తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం సమావేశం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో చేనేత విభాగం పలు తీర్మానాలు చేసింది. వెయ్యిమంది కార్మికులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గర్హనీయమని చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మలకిష్టప్ప అన్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేతకు ఒక్కపైసాకూడా కేటాయించలేదన్నారు. చంద్రబాబు హయాంలో చేనేత కార్మికులను పూర్తిస్థాయిలో అదుకున్నారన్నారు. చేనేత కార్మికులకూ ఉపాధి హామీ పథకం వర్తింపచేయాలని కిష్టయ్య డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అడుగపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే వైఎస్‌ విజయ దీక్ష నిర్వహించారని తెదేపా ప్రధాన కార్యదర్శి అనురాధ విమర్శించారు.

తాజావార్తలు