చేపపిల్లల లెక్కింపునకు బెల్జియం మిషన్‌

ప్రయోగాత్మకంగా పరిశీలన
నల్లగొండ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  చేపల పిల్లల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యంత్రం ద్వారా లెక్కింపు ప్రారంభించామని జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత తెలిపారు. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను లెక్కించి వదలనున్నట్లు వెల్లడించారు.  బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్న చేప పిల్లల లెక్కింపు యంత్రం ప్రయోగత్మకంగా పరిశీలించాం. యంత్రం చేప పిల్లల సంఖ్యను పక్కాగా లెక్కి స్తుందని గుర్తించాం. ప్రభుత్వానికి నివేదించి జిల్లాకు మరిన్ని యంత్రాలు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చెరువుల్లో చేపల పెంపకంపై దృష్టి సారించేందుకు మండలాల్లో ఎంపీడీఓ లను నోడల్‌ అధికారులుగా నియమించాం. మత్స్యకార్మికులు వారికి సహకరించాలన్నారు. చేపల లెక్కింపుతోపాటు చెరువుల్లో చేపల పెంపకం పర్యవేక్షణకు మత్స్యకార్మికులకు మత్స్యశాఖ మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. ప్రతి మండలంలోని ఆయా గ్రామపంచాయతీ పరిధిలోని చెరువుల్లో చేప పిల్లలను విడిచేందుకు ఎంపీడీఎను నోడల్‌ అధికారిగా నియమించడంతోపాటు రెవెన్యూ అధికారులను పర్యవేక్షకులు నియమించారు. వీరు నిరంతరం నిర్ణీత సైజులో చేపల పెరుగుదలపై దృష్టి సారిస్తారు. మత్స్యకారులకు ఇలా అధిక ప్రయోజకం చేకూరనుంది. చేప పిల్లలను వదిలేందుకు జిల్లాలో మత్స్యశాఖ మొత్తం 712చెరువులను గుర్తించింది. వీటిలో 212ఐబీశాఖ పరిధిలోని చెరువులు ఉండగా 9పెద్ద రిజర్వాయర్‌ ఉన్నాయి. మిగిలిన పంచాయతీ పరిధిలోని చిన్న చెరువులు ఉన్నాయి. వీటిలో 5కోట్ల చేప
పిల్లలను వదలాల్సి ఉండగా ఇప్పటికే కోటి పిల్లను 106రిజర్వాయర్‌లోకి వదిలారు. చేపలను విడిచే క్రమంలో వాటి లెక్క పక్కాగా ఉండటం లేదని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌ చేప పిల్లలను తక్కువగా సరఫరా చేస్తున్నట్లు సొసైటీ సభ్యులు ఆరోపణలు ఉండటం, చేపలను కొలతలు వేసే క్రమంలో మ్యాన్యువల్‌ పద్‌ధ్దతిలో లెక్కించే సమయంలో మృత్యువాత పడుతుండటమే ఇందుకు కారణమని గుర్తించారు. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో ఎక్కువ చేపలను అధునాతన సాంకేతిక పద్దతిలో చేపల బరువుతో సహా సంఖ్యను లెక్కించేందుకు రూ. 8లక్షలు వెచ్చించి ప్రభుత్వం యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏఎమ్మార్పీప్రాజెక్టు పరిధిలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ప్రయోగత్మకంగా ఈ యంత్రంతో చేప పిల్లలను లెక్కించి రిజర్వాయర్‌లోకి వదిలారు. ఇలా గంటకు లక్ష చేపల పిల్లలను మిషన్‌ ద్వారా లెక్కించి చెరువులో వదిలితే అవకాశం ఉంది. ప్రయోగత్మకం ఏకేబీఆర్‌లో చేప పిల్లలను విడిచే క్రమంలో యంత్రం పనితీరును అధికారులు పరీక్షించారు. ఈ పక్రియ విజవంతంమవడంతో మరిన్ని యంత్రాలను కొనుగొలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. మిషన్‌ లెక్కింపు ఆధారంగానే చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్ల చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

తాజావార్తలు