చేప పిల్లల పంపిణీ చేసిన ఎంపీపీ
అశ్వరావుపేట సెప్టెంబర్ 21( జనం సాక్షి )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట పంచాయతీలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చే ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి ప్రారంభించారు. ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటూ ఉచిత వాహనాలు, అలాగే ఉచితంగా చేప పిల్లలు, వాటినీ పెంచేందుకు ఆహారం, అలాగే అవీ అమ్ముకోవటానికి కాటాలు, కూలింగ్ బాక్స్ లు, తదితర సామగ్రి ను మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని,సంపదను పెంచి సంపదను పెంచే కార్యక్రమంలో తెరాస ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. వాటిలో భాగంగానే బుధవారo అశ్వారావుపేట మండల లో మొత్తం 50 చెరువులకు గాను,6,21,000 చేప పిల్లలు,వాటిలో బొచ్చులు-2,17,350,
రోహు -2,17,350,
బంగారు తీగ -1,86,300
చేప పిల్లలను మత్స్య కారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆట్టం. రమ్యా, నారం.రాజశేఖర్, గొందు లక్ష్మణ్ రావు,డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, ఎంపిటిసి భారతి, ఈ ఓ ఆర్ డి సీతా రామరాజు,మత్యశాఖ అధికారులు,మంగరాజు, కలపాల. శ్రీనివాసరావు,గంధం వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.