చేప పిల్లల పెంపకం వాటి యాజమాన్య పద్ధతులు పై అవగాహన.
నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్.అంతర్జాతీయ ఎరువుల అభివృద్ధి సంస్థ ఇక్రిశాట్ హైదరాబాద్ వారి అధ్వర్యంలో రంగా రెడ్డి,మెదక్,మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మత్స్య రైతుల బృందంనకు చేపల పెంపకం పై అవగాహన కలిపించడానికి గాను మండలంలోని,సోమవారం గ్రామంలో కొమర సురేష్ కి చెందిన హరిణి చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రాన్ని సందర్శించినట్లు కెవికె గడ్డిపల్లి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి.లవకుమర్ అన్నారు.ఈ సందర్బంగా,దాదాపు 30 గ్రామాలకు చెందిన మూడు ఉమ్మడి జిల్లాల రైతులు చేపల పెంపకం చేపట్టడానికి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సోమారం గ్రామంలో హేచేరీ,నర్సరీ, రియరింగ్,పెంపకము చెరువులను సందర్శించి చేప పిల్లల పట్టుబడి విదానం,ఆక్సిజన్ ప్యాకింగ్, చెరువులో వాడే వివిధ రసాయానాలు,మేతలు వాటి యాజమాన్యం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఇ ఎఫ్డిసి అగ్రికల్చర్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ కొండల మురళి మోహన్, లతో పాటు ఫీల్డ్ మానిటరింగ్ ఆఫీసర్స్ టీ.మల్లా రెడ్డి,రుక్మిణి ,అశోక్.కొమర సురేష్,మనోజ్, వెంకట్ రామ్ రెడ్డి,పాండు,సురేష్,మల్లేష్, అశోక్, బాల్ రాజు,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.