చౌక ధర దుకాణాల ద్వారా సక్రమంగా బియ్యం పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
-జిల్లా ఆదనపు కలెక్టర్ సి. శ్రీనివాసులు.గద్వాల నడిగడ్డ, ఆగస్టు 21 (జనం సాక్షి);చౌక ధర దుకాణాల ద్వారా సక్రమంగా బియ్యం పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు.
సోమవారం ఐ డి ఓ సి చాంబర్ ఆహార సలహా సంఘం సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు జిల్లాలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల కు మంజూరు చేసిన బియ్యం సరఫరా పై చర్చించారు.అంగన్వాడీ కేంద్రాలకు మధ్యాహ్న భోజన పథకానికి ఫోర్టిఫైడ్ బియ్యం గురించి వాటి పోషక విలువల గురించి తెలుసుకుని విద్యార్థులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా విద్యాధికారి సిరాజుద్దీన్ కు ఆదేశించారు. ఏప్రిల్ 2023 నుండి అన్ని రేషన్ షాపులలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ జరుగుతున్న తీరును చర్చించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ ఉమాదేవి, డిఈఓ సిరాజుద్దీన్, జిల్లా పౌరసరఫర అధికారి రేవతి, మహిళా రిప్రజెంటేటివ్ వెంకటేశ్వరి, సురేష్ శ్రీ నిషార్, అహ్మద్ పాషా సంబందింత అధికారులు పాల్గొన్నారు.