చౌటుప్పల్‌లో విషంతో పందుల మృతి

నల్గొండ,  జిల్లాలోని చౌటుప్పల్‌ గ్రామంలో పంచాయితీ సిబ్బంది ముందస్తు సమాచారం లేకుండా పందులకు విషం పెట్టి చంపారు. వందల సంఖ్యలో పందులు మృతి చెందాయి. దీంతో గ్రామపంచాయతీ సిబ్బంది తీరుకు నిరసనగా చనిపోయిన పందులతో పంచాయతీ కార్యాలయం ఎదుట వాటి యజమానులు ధర్నాకు దిగారు.