చౌళీ ఆశ్రమంలో దారుణం

మెదక్‌ : బీదర్‌ సమీపంలోని చౌళీ ఆశ్రమంలో దారుణం జరిగింది. ముగ్గురు స్వామీజీలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వీరు ముగ్గురు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. మఠంలోని వివాదాలే ఈ ఈత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. మృతులు జగదీశ్వర్‌, ప్రవీణ్‌, మల్లారెడ్డిగా గుర్తించారు.