ఛండీ యాగానికి రండి!
– గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్,డిసెంబర్1(జనంసాక్షి):
తానునిర్వహిస్తున్న చండీయాగానికి గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. సొంత వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున దీనిని చేపట్టారు. మంగళవారం సిఎం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న చండీ యాగానికి గవర్నర్‌ను ఆయన ఆహ్వానించారు. ఆయత చండీ యాగానికి గవర్నర్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. ఆయత చండీ యాగంకు ముందు జరిగే శాంతి పూజల్లో కేసీఆర్ దంపతులు పాల్గొన్న విషయం విదితమే. చండీ యాగం డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరగనుంది. యాగానికి సంబంధించి మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 3 వేల మంది పండితులతో ఈ క్రతువును కేసీఆర్ నిర్వహించనున్నారు. సుమారు 10 వేల మంది యాగాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.