ఛలో అసెంబ్లీలో పాల్గొంటాం: ఎమ్ జేఏసీ
హైదరాబాద్,(జనంసాక్షి): చలో అసెంబ్లీలో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బింది పాల్గొంటారని తెలంగాణ మెడికల్ జేఏసీ తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో అక్రమ అరెస్టులను ఆపకుండా అత్యవసర సేవలను నిలిపివేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. చలో అసెంబ్లీలో ప్రభుత్వం దమనకాండకు పాల్పడితే గాయపడ్డ వారికోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.