ఛలో అసెంబ్లీ సక్సెస్: టీడీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ సక్సెస్ అయ్యిందని టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నరసింహులు అన్నారు. సీఎం కిరణే పోలీసులతో అసెంబ్లీని దిగ్భంధించాలని చెప్పారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని వారు కోరారు.