ఛలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి….
రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం (జనంసాక్షి):- రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల సమస్యలపై మాట్లాడే, పరిష్కరించే సమయం లేనందునా వారి వద్దకే రాష్ట్రంలో ఉన్న ఆదివాసి గిరిజన రైతులు, నాయకులు, మేధావులతో తో కలిసి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం రోజున చలో ప్రగతి భవన్ ఉద్యమాన్ని విజవంతం చేయవలసింది గా కోరుతూ సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాబు నాయక్ గారి ఆదేశాల మేరకు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొర్ర బాలు నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తగిన న్యాయం జరగలేదు ప్రత్యేక తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగుపడతాయి అని సాధించుకున్న తెలంగాణ లో పోడు వ్యవసాయం, గిరిజన ఆదివాసీల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నది. అన్యాయంగా మాపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. గిరిజనులకు ఏ ప్రభుత్వం కూడా సెంటు భూమిని కూడా కొనుగోలు చేసి ఇచ్చిన దాఖలా లేదు.‘2006 అటవీ హక్కుల చట్టం’ ప్రకారం.. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కుల పత్రాలు ఇవ్వాల్సింది పోయి.. హరితహారం పేరిట మొక్కలు నాటాలని దౌర్జన్యం చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో పోడు గిరిజన రైతులపై , ఫారెస్ట్ సిబ్బంది అనేక సార్లు ఘర్షణకు దిగుతున్నారు నిరుపేద ఆదివాసీలను, గిరిజనులను ఇష్టం వచ్చినట్లు కొట్టడం, ఆసుపత్రిపాలు చేయడం, పసి పిల్లల తల్లులని కూడా చూడకుండా కేసులు పెట్టి జైలుపాలు చేయడం. పరిపాటిగా మారిందని పోడు వ్యవసాయం, ఆదివాసీల మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నది. అన్యాయంగా మాపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. మాపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.
గిరిజనుల ఆందోళనలను, హక్కుల పోరాటాలను అటవీ అధికారుల మీద దాడులుగా, భూ ఆక్రమణలుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అండదండలతో అడవిని నరికి రియల్ వ్యాపారం చేస్తున్న కబ్జాదారులు అడవి ప్రాంతంలో బహుళ అంతస్తులు మరియు పరిశ్రమల నిర్మాణంలో ద్వాంసమైనా అటవి భూమి ఎంతో శ్వేత పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు రాష్ట్ర సర్కారు ఇప్పటికైనా పోడు సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని . ఆ భూములకు పట్టాలు ఇచ్చి ఆదివాసీలకు వాటిపై సర్వ హక్కులు కల్పించాలని లేని పక్షములో రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెప్పడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కొర్ర శ్రీనివాస్ నాయక్ (సేవాలల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సబవట్ చంటి నాయక్ కొర్ర నరేందర్ నాయక్ వంశీ భాస్కర్ సాయి నాయక్ తరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు