ఛాంపియన్స్ లీగ్‌లో నైట్‌రైడర్స్‌కు ఆడనున్న నరైన్
జమైకా, జూలై 26 ం వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ వచ్చే సెప్టెంబర్‌లో జరగనున్న ఛాంపియన్స్ లీగ్‌లో తమ ఐపీఎల్ ఫ్రాంచైజీ తరపునే బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ నరైన్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన సీజన్‌లో సునీల్ నరైన్ అద్భుతంగా రాణించాడు. మొత్తం 24 వికెట్లు పడగొట్టి కోల్‌కత్తా ఫ్రాంచైజీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఛాంపియన్స్ లీగ్‌లో మాత్రం సొంత జట్టు ట్రినిడాడ్ అండ్ టొబాగోను కాదని నైట్‌రైడర్స్‌కే సునీల్ నరైన్ ఓటేశాడు. ట్రినిడాడ్ పత్రికల కథనం ప్రకారం బ్రేవో, కిరిణ్ పోలార్డ్, నరైన్‌లలో ఇద్దరే జట్టుకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది బ్రేవో, పోలార్డ్, కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకే ఆడడం విశేషం. ఛాంపియన్స్ లీగ్ నిబంధనల ప్రకారం రెండు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్ళు ఒక ప్రాంచైజీ తరపునే ఆడాలంటే మరోక ప్రాంచైజీ అనుమతి కావాలి. అలాగే వారికి నష్టపరిహారం కూడా చెల్లించాలి. గత ఏడాది బ్రేవో, పొలార్డ్‌లను వదులుకున్నందుకు ట్రినిడాడ్ టీమ్‌కు 1.1 మిలియన్ల నష్టపరిహారం కూడా అందింది. ప్రస్తుతం ప్రభుత్వం నుండి పరిహారం అందిస్తామని ఇటీవలే ఆ దేశ క్రీడామంత్రి ప్రకటించారు. అయితే పటిష్టమైన జట్టునే ఛాంపియన్స్ లీగ్ పంపిస్తామని ట్రినిడాడ్ చెబుతోంది. కాగా, గత ఏడాదిలానే ట్రినిడాడ్ క్వాలిఫైయింగ్ టోర్ని ఆడాల్సింది. మరి ఈ ఏడాదైనా ట్రినిడాడ్ అండ్ టొబాగో జాతకం మారుతుందో లేదో వేచిచూడాలి.