జంగా రాఘవ రెడ్డి ఖబర్దార్…!

వరంగల్ బ్యూరో అక్టోబర్ 10 (జనం సాక్షి)

హనుమకొండలోని బి.ఆర్. ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ జంగా రాఘవరెడ్డి వారం ప్రెస్ పెట్టిన ప్రెస్ మీట్ లో మంత్రి ఎర్రబెల్లి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీద చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.నాయిని రాజేందర్ రెడ్డి,జంగా రాఘవరెడ్డి మీకు మధ్య ఉన్నటువంటి గొడవల్లో మంత్రి ఎర్రబెల్లి, చీప్ విపు దాస్యం వినయ్ భాస్కర్ ను కలుపుకొని రాజేందర్ రెడ్డి తో కుట్రపల్లి రాజేందర్ రెడ్డి మనుషులతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టించాడనడం సిగ్గుచేటని అన్నారు. మీ కాంగ్రెస్ పార్టీలో మీ ఇద్దరి మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్ల మీకు మీకు పడక మీరు ఏమైనా చేసుకోండి,తిట్టుకోండి, కొట్టుకోండి, తన్నుకోండి, మీరు ఏమైనా చేసుకోండి.మాకు గాని, పార్టీకి గానీ, మంత్రి ఎర్రబెల్లికి గాని, చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు గాని ఎటువంటి సంబంధం లేదు. ఓటమి ఎరుగని నాయకులపై నీవు చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. 2018 ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం లో నియోజకవర్గ ప్రజలు చీకొడితే జనగామ కు పారిపోయి, జనగామ నుండి మళ్లీ పశ్చిమ నియోజకవర్గం వచ్చి అల్లర్లు సృష్టించి, అశాంతి నెలకొల్పి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న నీకు ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు.నీకు ప్రజలకు సేవ చేయాలని,గెలవాలనే చిత్తశుద్ధి ఉంటే ఇలాంటివి మానుకోవాలని అన్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల బాగోగులు చూస్తూ, ప్రజల మన్ననలు పొందుతూ అనేక పర్యాయాలు శాసనసభ్యులుగా గెలుపొందిన నాయకులపై విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.ఈ చారిత్రాత్మక వరంగల్ నగరంలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని, తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలతో పాటు,పశ్చిమ నియోజకవర్గం రూ.5500 కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత చీప్ వీప్ దాస్యం వినయ్ భాస్కర్ దని అన్నారు. అలాంటి వ్యక్తి పైన విమర్శలు చేయడం సూర్యుడి పైన ఉమ్మివేసినట్లే అని అన్నారు. జంగా రాఘవరెడ్డిని ఉద్దేశించి నీకు దమ్ముంటే నీ పార్టీలో టికెట్ తెచ్చుకో, లేకపోతే ఇండిపెండెంట్ గా నైనా పోటీలో నిలబడి గెలవాలని సూచించారు. ఇకనుంచైనా హుందాగా మాట్లాడాలని, చిల్లర రాజకీయాలు చేయొద్దని అన్నారు. నీపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది బిఆర్ఎస్ పార్టీ మంత్రి ఎర్రబెల్లికి గానీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గాని సంబంధం లేదని అన్నారు. ఓడిపోతారనే భయంతో కేసులు పెట్టించామనడం నీ యొక్క అవివేకమని, ప్రజల మనసులు గెలుచుకొని గెలవాలి తప్ప, తప్పుడు ఆరోపణలు, తప్పుడు నిందలు వేసే నీచ సంస్కృతిని విడనాడాలని అన్నారు. నీ చరిత్ర, నీ యొక్క రాజకీయ జీవితం, డిసిసిబి చైర్మన్ గా నీవు చేసిన అవినీతి పనుల గురించి అందరికీ తెలుసు అన్నారు, చీప్ విత్ దాస్యం వినయ్ భాస్కర్ పైన తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడిన కేసులు ఉన్నాయే తప్ప,ఎటువంటి అవినీతి,ఆరోపణాలు కలిగినటువంటి కేసులు గాని, బెదిరించిన కేసులు గాని, రౌడీ షీట్ కు సంబంధించిన కేసులు గాని లేవని అన్నారు. అవన్నీ నీ పైన ఉన్నాయి కాబట్టే నీవే కొన్ని ఓట్ల కోసం ఇంత నీచానికి దిగజారావని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ డైరెక్టర్ గుర్రాల ప్రభాకర్ రెడ్డి,బి ఆర్ ఎస్ నాయకులు రెంటాల కేశవ రెడ్డి, కోయగూర వెంకటరంగా రెడ్డి, సుగుణాకార్ రెడ్డి, చాడా నేపాల్ రెడ్డి, పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి, పెండ్యాల శ్వేతా రెడ్డి,నల్ల సుధాకర్ రెడ్డి, తుమ్మేటి జయపాల్ రెడ్డి, వెలపాటి హేమ్ సుందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితులు పాల్గొన్నారు.