జగన్‌కు ఆస్తులు ప్రకటించే దమ్ముందా?
నారా, వైఎస్ ఇంటిపేర్లకు చాలా తేదా ఉంటుంది
తాము అభివృద్ధి మార్గం ఎంచుకుంటే.. విూరు వినీతి మార్గం ఎంచుకున్నారు
జగన్‌కు ట్విట్టర్ వేదికగా లోకేశ్ విమర్శలు
అమరావతి,జూన్6(జనం సాక్షి): ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికిగా వైసీపీ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గత రెండుమూడు రోజులుగా వైసీపీ తీరుపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ బుధవారం ట్విట్టర్లో స్పందించారు. ప్రియమైన ప్రతిపక్ష నేత గారు.. అంటూ సంభోదిస్తూనే.. ఆయన చేసిన ఆరోపణలను తీవ్రస్థాయిలో ఖండించారు. నారా, వైఎస్ ఇంటి పేర్లకు చాలా వ్యత్యాసం ఉందని, తాము అభివృద్ధి మార్గం ఎంచుకుంటే, విూరు అవినీతి, అక్రమాల వైపు ఉంటారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఆస్తులు ప్రకటించేది తమ కుటుంబం మాత్రమేనన్న లోకేశ్… విూ ఆస్తులు ప్రకటించే దమ్ముందా అని జగన్‌కు సవాల్ విసిరారు.హెరిటేజ్ సంస్థ 25 ఏళ్ల శ్రమ ఫలితం.. సంస్థ ఎదుగుదల కోసం అమ్మ, బ్రాహ్మణి నిరంతరం కష్టపడుతున్నారు. హెరిటేజ్ విలువలతో ఎదిగిన సంస్థ కాబట్టే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 20కి పైగా కేసులు పెట్టించినా ఒక్క ఆధారం కూడా చూపించ లేకపోయారు. ఇప్పటికైనా విూలో పరివర్తన వచ్చి సక్రమ మార్గంలో నడుచుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ లోకేశ్ ట్విట్ చేశారు.