జగన్ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయి: వైయస్ విజయ
పూడూరు: జగన్ అధికారంలోకి వస్తేనే పేదల కష్టాలు తీరుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయ పేర్కొన్నారు. పూడూరులోని అంగడి చిత్తంపల్లిలో శనివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల సమస్యల అడిగి తెలుసుకున్నారు.