జగన్ నిర్భంధాన్ని నిరసిస్తూ గుండు గీయించుకున్న వైఎస్ అభిమానులు
నల్గొండ, జనంసాక్షి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన్ రెడ్డి నిర్బంధానికి నిరసనగా యాదగిరిగుట్టలో వైఎస్‌ఆర్ అభిమానులు 30 మంది గుండు గీయించుకున్నారు. జగన్ అరెస్టుకు నిరసనగా వడ్లోజు వెంకటచారి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు 365 వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా గుండు గీయించుకున్న అభిమానులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.