జగన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టుయిన వైకాపా అధ్యక్షుడు జగన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది, ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రముఖ రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారని వివిధ మార్గాల్లో విచారణ సాగుతోందన కోర్టుకు తెలియజేశారు. మారిషన్ నుంచి లక్సెంబర్గ్ ద్వారా నిదుల మళ్లింపు జరిగిందని.. వీటికి సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు, సండూరు, భారతి, పెన్నా, దాల్మియా కంపెనీలకు లబ్ది చేకూర్చేలా జగన్ ఒత్తిడి చేశారని తెలియజేశారు. ఈ అక్రమాస్తుల కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని.. నాలుగు ఛార్జిషీట్లలో ఇప్పటివరకు రూ. 3 వేల కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.