జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: సీబీఐ న్యాయస్థానంలో జగన్‌కు మరోసాని భంగపాటు ఎదురైంది. అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న జగన్‌ దాఖలుచేసుకున్న రెండు బెయిల్‌ పిటిషన్‌లలో ఒకదానిని సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. మరో పిటిషన్‌పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఏడు అంశాలపై దర్యాప్తు సాగుతున్నందున బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ వాదించగా న్యాయస్థానం సీబీఐ వాదనతో ఏకీభవించింది.