జడ్పిటిసి గట్ల మీనయ్య చేతుల మీదుగా జాతీయ జెండాల పంపిణీ

రుద్రంగి ఆగస్టు 10 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి గట్ల మీనయ్య హాజరై జాతీయ జెండాలను రుద్రంగి గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుధాకర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు