జడ్పీ జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆదివాసీ మహిళ జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలలో ఆదివాసీ బిడ్డకు అవకాశం ఇచ్చిన జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్.

ములుగుజిల్లా
బ్యూరో,ఆగస్టు 15 (జనం సాక్షి):-
ఆదివాసీలకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్న బడే నాగజ్యోతి జడ్పీకార్యాలయం జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న తాడ్వాయి మండల జడ్పీటీసీ శ్రీమతి బడే నాగాజ్యోతికి75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆదివాసీ బిడ్డకు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ జాతీయ పతాకం ఆవిష్కరణ చేయాలని అవకాశం ఇచ్చారు.నేడు జడ్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆదివాసీ ముద్దు బిడ్డ బడే నాగజ్యోతి ఆవిష్కరించారు.మహిళలను గౌరవిస్తూ నాకు అవకాశం కల్పించడం ఆడివాసీలకు దక్కిన అరుదైన గౌరంగా భావిస్తున్నాను అని బడే నాగజ్యోతి తెలిపారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ అవకాశం వస్తే ఐదు నిముషాలు అధికారం వదిలిపెట్టని ఈరోజుల్లో మహిళలకు ఆదివాసీలకు అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో నాతోటి ఆదివాసీ మహిళలకు జాతీయ జెండా ఆవిష్కరణ కొరకు అవకాశం ఇచ్చామని ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ తెలిపారు.మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలి అని కోరుకున్నారు.జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్,జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి ప్రజలందరికీ 75 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
వీరి వెంట జడ్పీ డిప్యూటీ సీఈఓ రమాదేవి,జడ్పీటీసీ శ్రీమతి సకినాల భవాని,గై రుద్రమదేవి అశోక్, పుష్పలత,జడ్పీ కో ఆప్షన్ రియాజ్ మీర్జా,ఎంపీటీసీ లు,సర్పంచ్లు,జడ్పీ అధికారులు,నాయకులు
ప్రజలు,పాల్గొన్నారు.