జనవరి ఒకటి నుంచి నగదు బదిలీ – ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : జనవరి ఒకటి నుంచి దేశంలో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రధానమంత్రి మహ్మూెహాన్‌సింగ్‌ సింగ్‌ తెలిపారు. సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అందించేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ప్రభుత్వం వారికోసం అందిస్తున్న సబ్సిడీలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. తొలి విడతగా 51 జిల్లాల్లో పథకాన్ని అమలు చేస్తామని, దశాల వారీగా 2013 చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. సమావేశంలో 18 శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు