జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13 వ తేదీ 2021 న ప్రారంబించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల కోరిక మేరకు ఈ రోజు 134 వ సారి అన్నపూర్ణ అన్నదాత బెల్లంపల్లి మండలం చిన్న బుదే గ్రామానికి చెందిన సింగతి కవిత రవికుమార్ దంపతుల కుమారుడు సింగతి అక్షర వర్మ జన్మదినం సందర్భంగా యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేయడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత సోదరుడు అక్షయన్ వర్మ, జనహిత సేవా సమితి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల రమాదేవి, సహాయ కార్యదర్శి కరిష్మా, సభ్యులు బొలిశెట్టి సుధాకర్, బియ్యాల గణేష్, నిచ్చకోలా గురుస్వామి పాల్గొన్నారు.

తాజావార్తలు