జన్‌లోక్‌పాల్‌కు అన్నా మద్ధతు

3

న్యూఢిల్లీ,డిసెంబర్‌1(జనంసాక్షి):

జన్‌లోక్‌పాల్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అడ్డుకుంటే తాను జోక్యం చేసుకుంటానని సామాజిక కార్యకర్త అన్నాహజారే అన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం న్న దిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్‌ బిల్లును ప్రవేశపెట్టింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి సహకరించే జన్‌లోక్‌పాల్‌ బిల్లును తప్పక అమలు చేస్తామని కేజీవ్రాల్‌ ఎన్నికల సమయంలో హావిూ ఇచ్చారు.జన్‌లోక్‌పాల్‌ బిల్లు విషయంపై ఆప్‌ నేతలు కుమార్‌ విశ్వాస్‌, సంజయ్‌సింగ్‌లు  అన్నాహజారేని ఆయన స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో కలిసి మాట్లాడారు. వారిని కలిసిన అనంతరం హజారే విలేకరులతో మాట్లాడారు. జన్‌లోక్‌పాల్‌ విషయంలో ఆప్‌కు పూర్తి మద్దతిస్తున్నట్లు హజారే తెలిపారు. ఈ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం అడ్డుకుంటే తాను జోక్యం చేసుకుంటానని చెప్పారు.