జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు
ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి విషమం
ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
టోక్యో,జూలై8(జనంసాక్షి ): జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. నారా నగరంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే వేదికపై ప్రసంగిస్తూ షింజో అబే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో తుపాకీ పేలిన శబ్దం వినిపించినట్లు స్థానిక విూడియా తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు షింజోపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ గాయాలతో రక్తమోడుతున్న అబేను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా షింజో అబేలో ఎలాంటి కదలికలు లేవని స్థానిక విూడియా వెల్లడిరచింది. అనారోగ్య కారణాలతో ప్రధానమంత్రి పదవికి అబే రాజీనామా చేశారు. మాజీ ప్రధాని షింజో అబేపై ఛాతిలోకి ఆగంతకుడు గన్‌తో కాల్చాడు. నారా నగరంలో ఉన్న ఓ వీధిలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. కార్డియోపల్మోనరీ అరెస్ట్‌లో అబే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. హాస్పిటల్‌కు తీసుకువెళ్తున్న సమయంలో ఆయన స్పృహలో లేరు. షింజో అబే ఛాతి నుంచి విపరీతంగా రక్తం కారింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అబేపై రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు సోషల్ విూడియాలో వైరల్ అవుతున్న వీడియోల ద్వారా స్పష్టం అవుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న హై స్కూల్ విద్యార్థులు ఈ కాల్పుల్ని ప్రత్యక్షంగా చూశారు. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న గన్‌తో రెండు షాట్స్ కాల్చినట్లు ఆ విద్యార్థులు చెప్పారు. తొలి షాట్ కాల్చినప్పుడు బజూకా శబ్దం వచ్చిందని, ఇక రెండవ షాట్ కోసం ఆగంతకుడు వెనక్కి వెళ్లి కాల్చాడని, అప్పుడు వైట్ స్మోక్ వచ్చినట్లు ఓ సాక్షి తెలిపారు. కషిహరా నగరంలో ఉన్న నారా
మెడికల్ వర్సిరటీకి వెంటనే హెలికాప్టర్ ద్వారా అబేను తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద ఉన్న గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆగంతకుడిని టెట్‌సుయా యమగామిగా గుర్తించారు. నారా నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి అతను. ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని ఫుమియో కిషిడా ఈ ఘటన గురించి తెలుసుకుని టోక్యో చేరుకున్నారు.