జమిలి అసాధ్యం
` లా కమిషన్ అభిప్రాయం!
` 2029 సాధారణ ఎన్నికలకు కొత్త ఫార్ములా రూపకల్పన!
ఢల్లీి(జనంసాక్షి): మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.అయితే, 2024లో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీంతో 2029 నుంచి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. వివిధ రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని పెంచడం లేదా తగ్గించడం ద్వారా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సిఫార్సులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు లోక్‌సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు ఒకేరకమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు లా కమిషన్ ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తద్వారా ఖర్చు, మానవ వనరులను తగ్గించుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాటిని కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు రూపొందిస్తున్నాయి. అయితే, ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికీ.. కొన్ని సమస్యలు పరిష్కారం కానందున దీనిపై లా కమిషన్ తుది నివేదిక సిద్ధం చేయలేదని తెలుస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించవచ్చని లా కమిషన్ భావిస్తోందని.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి.లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించడమే ప్రస్తుత లా కమిషన్ విధి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఇటీవలే తొలి సమావేశం నిర్వహించిన ఈ కమిటీ.. దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న యోచనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది.ఇదిలా ఉంటే, ఏకకాల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్తీ ఇటీవల పేర్కొన్నారు. ఈ అంశంపై నివేదిక సమర్పణకు తుది గడువు ఏవిూ లేదన్నారు. పోక్సో చట్టం, ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌లపై నివేదికలను న్యాయశాఖకు పంపినట్లు వెల్లడిరచిన ఆయన.. జమిలి ఎన్నికలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందన్నారు. దీనిపై తుది నివేదిక సిద్ధం కాలేదని చెప్పారు.