జమ్మూలో దాష్టికం
– ఎమ్యెల్యే రషీద్‌పై సిరా దాడి
న్యూఢిల్లీ,అక్టోబర్19(జనంసాక్షి): జమ్మూకశ్మీర్ స్వతంత్ర ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్‌పై ఈరోజు దిల్లీలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు సిరాతో దాడి చేశారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన ముఖంపై నల్ల సిరా పోసి పారిపోయినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా పాకిస్థాన్‌లోని తాలిబన్ల గురించి మాట్లాడుతున్నారు.. కానీ భారత్‌లో ఏం జరుగుతోందో చూడాలని ఆయన అన్నారు. తనపై దాడి చేసిన వారంతా మతి స్థిమితం సరిగాలేనివారుగా ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌లో 80 వేల మంది చనిపోయారని, తన ఒక్కడిపై సిరా పోస్తే.. ఎలాంటి మార్పు రాదని ఎమ్మెల్యే అన్నారు. కొద్ది రోజుల క్రితం రషీద్.. కశ్మీర్‌లో బీఫ్ పార్టీ ఇచ్చారంటూ భాజపా నాయకులు ఆయనపై అసెంబ్లీలోనే దాడి చేసిన సంగతి తెలిసిందే.