జయలలితను మందలించిన సుప్రీం కోర్టు

24JAYA84aపరువు నష్టం దావా కేసుల విషయంలో తమిళనాడు సీఎం జయలలితపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా జీవితంలో ఉంటున్నప్పుడు విమర్శలను ఎదుర్కోవడం తప్పని సరి అని కోర్టు అభిప్రాయపడింది. పరువు నష్టం దావా సెక్షన్ ను రాజకీయ కక్ష్య సాధింపు కోసం దుర్వినియోగం చేయరాదని హితవు పలికింది. తమిళనాడు ప్రభుత్వం పరువు నష్టం దావా సెక్షన్ ను ఎక్కువగా దుర్వినియోగం చేస్తుందని, సీఎం ఆరోగ్యంపై కథనాలు ప్రచురించినందుకు కూడా పరువు నష్టం కేసులు వేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరువు నష్టం దావా కేసులు వేయడం కాకుండా…పాలనపై దృష్టి పెట్టాలని తమిళనాడు సర్కారుకు సూచించింది అత్యున్నత న్యాయస్థానం.