జవహర్ నవోదయ ఎంట్రన్స్ లో రాష్ట్రస్థాయి ఐదవ ర్యాంకు సాధించిన ప్రణయ్ రెడ్డి

జూలై 11 (జనం సాక్షి): జవహర్ నవోదయ ఎంట్రన్స్ 2002- 2003 చలకుర్తి నవోదయ ఫలితాల్లో మండల పరిధిలోని పొనుగోడు గ్రామానికి చెందిన దొంతి రెడ్డి ప్రణయ్ రెడ్డి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు. నల్గొండ జిల్లాలోని చలకుర్తి నవోదయ పాఠశాలలో 2022- 2023 కు ఏప్రిల్ లో జరిగిన ఆరవ తరగతి ఎంట్రన్స్ లో దొంతి రెడ్డి ప్రణయ్ రెడ్డి రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఫోన్ ద్వారా తెలియజేసినట్లు తల్లిదండ్రులు ప్రణీత సతీష్ రెడ్డిలు తెలిపారు. పొనుగోడు లోని మండల ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదివి జవహర్ నవోదయ ఎంట్రన్స్ రాసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు విద్యార్థి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ ప్రజల హర్షం వ్యక్తం చేశారు.