జవాబుదారీతనం కోసమే వస్తు సేవల పెంపు
హైదరాబాద్: సేవా పన్ను పరిధిలోకి ఎక్కువ వస్తు సేవల్ని పొందుపరిచడమనేది ఆదాయం కోసం కాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సభ్యురాలు షీలా సంగ్వాస్ స్పష్టం చేశారు. వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చేందుకే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు. సమాజిక బాధ్యత, ప్రారిశ్రామిక సేవా రంగాల స్థితిగతులతో పాటు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించటం చాలా క్లిష్టమైన పనిగా ఆమె అభివర్ణించారు. 1994 నుంచి నేటి వరకు సేవా పన్నుల జాబితాలో కీలకమైన మార్పులు తీసుకువచ్చినట్లుగా షీలా సంగ్వాస్ తెలిపారు. సేవా పన్నుల పరిధిలోకి కొత్త వస్తువుల్ని చేర్చడం తప్పదని ఆమె వెల్లడించారు.