జాకారంలో అటో బొల్తా-పది మందికి తీవ్రగాయలు
ములుగు: మండలంలోని జాకారం గ్రామ సమీపంలో అటో బొల్తా పడి పది మందికి తీవ్ర గాయాలయ్యాయి . ఇందులో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది క్షతగాత్రులను సమీప అసుపత్రికి తరలించారు. ములుగు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన పది మంది ములుగులో కోర్టు కేసు విచారణ నిమిత్తం అటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది