జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ
నిజామాబాద్,సెప్టెంబర్9 (జనం సాక్షి ) : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలో భారీగా బతుకమ్మ పండగను నిర్వహిస్తామని ప్రకటించారు. బతుకమ్మ వేడుకలకు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటారని జాగృతి మహిళా విభాగం ప్రకటించింది.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో బతుకమ్మలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బతుకమ్మ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ ఆదేశించడంతో జిల్లాలో కూడా జాగృతి ఏర్పాట్లు చేస్తుందన్నారు. బతుకమ్మ పండుగతో పాటు తొమ్మిది రోజులపాటు పలుప్రాంతాల్లో కవిత పాల్గొంటారని అన్నారు. పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయించినందున భారీగా మహిళలు హాజరవుతారని అన్నారు.