జాజుల కు జిల్లా నేతల అభినందనలు

కరీంనగర్    ( జనం సాక్షి ) :

ఢిల్లీ లో కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో జరిగిన ఓబీసీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచమల్ల రాజు, దోగ్గలి శ్రీధర్ హాజరయ్యారు.ఈ సమావేశం లో జాజుల శ్రీనివాస్ గౌడ్ ని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారిని అభినందించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బీసీల సమ్యలపై నిరంతరం పోరాడుతానని తెలిపారు. దేశంలో విద్య, వైద్యం ఉచితంగా అందేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పోరాడుతామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు
GS ఆనంద్, ఓరుగంటి భార్గవ్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు , నాయకులు కొలిపాక శ్రీనివాస్ , అజయ్ తదితరులు పాల్గొన్నారు.